ములుగు జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరై జాతీయ జెండా ఎగరవేశారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు అతిథులకు గౌరవ వందనం చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి ప్రతిబింబించేలా శకటాలు ప్రదర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
రైతు సంక్షేమానికే పెద్దపీట: మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు - జెండా ఆవిష్కరణ
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు.
ములుగులో చీఫ్‌విప్ జెండా ఆవిష్కరణ