ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మాస్కులు ధరించని వారిని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలను పాటించని వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
'మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు'
కరోనా రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
mulugu sp
యజమానులు తమ దుకాణాల వద్ద.. ప్రజలు భౌతిక దూరం పాటిచేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎస్పీ. అందరూ నాణ్యమైన మాస్కులు ధరించాల్సిందిగా సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్ శ్రీనివాస్