తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలి : శోభారాణి - ములుగు జిల్లా తాజా సమాచారం

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామపంచాయతీలోని నందిపాడు కోయగూడెంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు శోభారాణి పర్యటించారు. అంగన్‌వాడీల నుంచి వారికి అందుతున్న పోషకాహారంపై ఆరా తీశారు. జిల్లాలో బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎస్పీతో చర్చించారు.

state childrens rights commission member visits mulugu district
ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలి : శోభారాణి

By

Published : Nov 12, 2020, 5:41 PM IST

ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌ మండలం లింగాపూర్ గ్రామపరిధిలోని నందిపాడు కోయగూడెంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు శోభారాణి పర్యటించారు. అంగన్‌వాడీల నుంచి వారికి అందుతున్న పోషకాహారంపై ఆరా తీశారు. వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చామని ఆమె తెలిపారు. జిల్లాలో బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎస్పీతో చర్చించారు.

తమకు కనీస సౌకర్యాలు లేవని గూడెం ప్రజలు ఆమెకు విన్నవించారు. ఆధార్, రేషన్‌ కార్డులు లేవని, తహసీల్దార్ తమ పిల్లలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అందేలా చూస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల నుంచి గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు అందాల్సిన పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. వీరందరికి సకాలంలో అన్ని సరుకులను అందజేయాలని లింగాపూర్ అంగన్‌వాడీ టీచర్‌ను శోభారాణి ఆదేశించారు.

ఇదీ చూడండి:'ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు' నిబంధనపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details