తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేడారం జాతర ఆహ్వానపత్రాలు, జ్ఞాపికలూ ప్లాస్టిక్ రహితమే' - మేడారం జాతర

గిరిజన సంక్షేమ శాఖలో ఖర్చు తగ్గించే అంశాలను గుర్తించి వాటి ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా జరపాలని ఆదేశించారు. ఆహ్వానపత్రాలు, జ్ఞాపికలను కూడా ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని పేర్కొన్నారు.

satyavathi rathod
satyavathi rathod

By

Published : Dec 13, 2019, 8:39 PM IST

గిరిజన సంక్షేమ శాఖ ఫలాలను అనర్హులు పొందుతున్నట్లైతే వారిని గుర్తించి శిక్షించేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు, మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వచ్చే ఏడాది పదవీవిరమణ చేసే ఉద్యోగుల వివరాలను రూపొందించాలని ఆదేశించారు.

ఖర్చు తగ్గించే అంశాలను గుర్తించి వాటి ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా జరపాలని ఆదేశించారు. ఆహ్వానపత్రాలు, జ్ఞాపికలను కూడా ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని పేర్కొన్నారు. వస్త్రం, ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయించాలని సూచించారు. నెలాఖరుకల్లా ఆహ్వానపత్రాలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: మేడారం జాతరను ప్లాస్టిక్​ రహితం చేసేందుకు ప్రణాళిక

ABOUT THE AUTHOR

...view details