మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 4 నుంచి 8 వరకు ఇరవై ప్రత్యేక రైళ్లు మేడారానికి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్-వరంగల్- హైదరాబాద్ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు.