తెలంగాణ

telangana

ETV Bharat / state

ముత్యాల సవ్వడులు... బొగత అందాల పరవళ్లు చూశారా..! - ముత్యాల జలపాత అందాలు

చురుకుగా విస్తరించిన... నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. దీనితో జలపాతాలకు జలకళ సంతరించుకుంటున్నాయి. ములుగు జిల్లాలో ప్రఖ్యాత బొగత, ముత్యం జలపాతాలు వడవడిగా పారుతూ కనువిందు చేస్తున్నాయి.

special story on Bogatha and mutyala waterfalls in mulugu district
ముత్యాల మురిపాలు... బొగత అందాల పరవళ్లు చూశారా..!

By

Published : Jun 20, 2020, 9:11 AM IST

Updated : Jun 20, 2020, 9:36 AM IST

ముత్యాల మురిపాలు... బొగత అందాల పరవళ్లు చూశారా..!

రుతుపవనాల ప్రభావంతో.. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీనితో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలోని.. అటవీ ప్రాంతంలోని ముత్యల జలపాతం.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలనురగల్లాంటి జలధారలు కొండపై నుంచి కిందకు పరుగులు పెడుతూ మనోహరంగా నిలుస్తున్నాయి. జలధారల సవ్వడులతో.. అటవీ ప్రాంతం మారుమ్రోగుతోంది.

ములుగు జిల్లా వాజేడు మండలంలో నెలకొన్న.. తెలంగాణ నయగరా బొగత జలపాతం కూడా.. జోరుగా ప్రవహిస్తోంది. గత 4 రోజులుగా ములుగు, ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు పడుతుండటం వల్ల బొగత కొత్త అందాలు తెచ్చుకుంది. కొండకోనల్లో నుంచి వడివడిగా.. పరుగులు తీస్తున్న జలధారలు.. కన్నార్పకుండా చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని... సందర్శకులను అనుమతించట్లేదు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

Last Updated : Jun 20, 2020, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details