కొవిడ్-19 తీవ్రత పెరుగుతున్న తరుణంలో ములుగు జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలను పంచాయతీ అధికారులు అప్రమత్తం చేశారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో అధికారులు సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేయించారు.
జంగాలపల్లిలో సోడియం హైపో క్లోరైట్ పిచికారీ - Mulugu Jangalapalli Sodium Hypo Chlorite Spray
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ములుగు జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముందు జాగ్రత్తలను చేపట్టారు. జిల్లాలోని ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సోడియం హైపో క్లోరైట్ పిచికారీ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా... పరిసరాలన్నీ శుభ్రపరిచేందుకు తాము రసాయన ద్రావణాన్ని స్ప్రే చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మాస్క్లు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు