Illness to Seethakka: కళ్లు తిరిగి పడిపోయిన సీతక్క.. - Telangana news
15:19 September 21
దళిత గిరిజన దండోరా ర్యాలీలో సీతక్కకు అస్వస్థత
నిత్యం ప్రజల్లో ఉండే ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు (Illness to Seethakka) గురయ్యారు. ఒక్కసారిగా బీపీ పడిపోవడం వల్ల ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రథమ చికిత్స అందించారు. వైద్యులు సీతక్కకు వైద్యం అందించిన తర్వాత ఆమె కాస్త కుదుటపడ్డారు. సీతక్కకు అస్వస్థత (Illness to Seethakka)కు గురికావడం వల్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళకు గురయ్యారు.
అంతకముందు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు దళిత గిరిజన దండోరా ర్యాలీ చేపట్టారు. దళిత గిరిజన దండోరా కార్యక్రమం (Congress Dalit Girijan Dandaora)లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క... స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలో నడుస్తూనే సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే కార్యకర్తలు సీతక్కను హుటాహుటిన ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపటి తర్వాత విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం సీతక్క ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే సీతక్క చురుగ్గా పాల్గొంటారు. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనపై ఆమె స్పందిస్తారు. ఇటీవల సైదాబాద్ ఘటనపై కూడా మొదటగా స్పందించింది ఆమేనని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కోసమే ఆలోచించే వ్యక్తి సీతక్క అని ఆమె అభిమానులు అంటున్నారు.