తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో వనదేవతల శుద్ధి పండుగ

మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మకు పూజారులు శుద్ధి పండుగ నిర్వహించారు. అమ్మవార్లకి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి రహస్యంగా పూజలు నిర్వహించారు. వచ్చే బుధవారం చిన్న జాతరను నిర్వహించేందుకు తమకు శక్తులను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు.

shuddhi panduga at medaram and Worship of Sammakka in Medaram and Saralamma in Kannepalli
మేడారంలో వనదేవతల శుద్ధి పండుగ

By

Published : Feb 18, 2021, 11:51 AM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతల చిన్న జాతర పూజా కార్యక్రమ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజారులందరూ డోలి వాయిద్యాలతో అమ్మవారి పూజా మందిరానికి తరలివచ్చి గుడి పరిసరాలను నీటితో శుద్ధి చేశారు.

అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి రహస్యంగా పూజలు నిర్వహించారు. వచ్చే బుధవారం(ఫిబ్రవరి 24) నిర్వహించే మండమెలిగే పండుగ(చిన్న జాతరను) నిర్వహించేందుకు తమకు శక్తులను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి సిద్దబోయిన మహేందర్‌తో పాటు మహేశ్‌, కుక్కర్ కృష్ణయ్య, పూజారులు సిద్దబోయిన పాపారావు, సమ్మయ్య, దోబె నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణలో 1,700 కరోనా యాక్టివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details