ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేశారు. ఈనెల 11న జరిగే మహాశివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం నాలుగున్నర నుంచి దేవాస్థానం శుద్ధిచేసి దేవుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీటితో అభిషేకం చేసి దీపారాధన చేస్తారు.
రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు - Mulugu district latest news
ములుగు జిల్లా పాలంపేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయాన్నే శివలింగానికి అభిషేకం చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ మహోత్సవంలో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని అర్చకులు సూచించారు.
రామప్ప దేవాలయంలో శివరాత్రి ఏర్పాట్లు
శివరాత్రి రోజున వేలాది మంది వస్తారని.. ఏర్పాట్లు చేస్తున్నారని అర్చకుడు ఉమాశంకర్ తెలిపారు. భక్తులు మాస్కు ధరించి అభిషేకాలు, అర్చనలు చేసుకోవాలన్నారు. కళ్యాణ మహోత్సవంలోనూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.