తెలంగాణ

telangana

ETV Bharat / state

రామప్పలో వైభవంగా శివపార్వతుల కల్యాణం - తెలంగాణ వార్తలు

శివరాత్రి వేళ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

shiva-parvathi-kalyanam-at-ramalingeswara-swamy-temple-in-ramappa-mulugu-district
రామప్పలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

By

Published : Mar 12, 2021, 1:26 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు ఉపవాస దీక్షలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సీతక్క అతి సాధారణ భక్తురాలిలాగే హాజరయ్యారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి రావు పాటిల్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రశ్నించే గొంతుక కాదు... పరిష్కరించే గొంతుక కావాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details