తెలంగాణ

telangana

ETV Bharat / state

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర" - trs

పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్​ చేశారు. పోడు చేసుకున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ములుగు జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర"

By

Published : Jul 10, 2019, 6:49 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిపై దాడులు చేయడమేంటని ఎమ్మెల్యే సీతక్క భగ్గుమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఆందోళన వల్ల జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర"

ABOUT THE AUTHOR

...view details