Seethakka met the governor for probalams of tribal university: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హమీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఏపీలో ఇప్పటికే ప్రారంభం కాగా మన రాష్ట్రంలో దాని ప్రసక్తే లేవనేత్తలేదని ఆమె అన్నారు.
రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన సీతక్క.. గిరిజన విశ్వవిద్యాలయం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మేడారం పర్యటనకు వచ్చిన సందర్భంలో గవర్నర్‌కు వివరించానని, మరోమారు తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ఎనిమిదేళ్లు గడచినప్పటికీ విశ్వవిద్యాలయం మందుకెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని సీతక్క అన్నారు. విశ్వవిద్యాలయం పూర్తి అయితే ఇప్పటికే పర్యాటక రంగంలో ముందున్న ములుగు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.