కరోనా నిబంధనల మధ్య ములుగు జిల్లాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల వద్ద అంగీకారం తీసుకుని పాఠశాలలకు హాజరయ్యారు. మాస్కు ధరించి, చేతికి శానిటైజర్ రాసుకుని, భౌతిక దూరం పాటిస్తూ.. క్లాసులు విన్నారు.
తెరుచుకున్న పాఠశాలలు.. ఆనందంలో విద్యార్థులు - schools reopened in mulugu district
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు జిల్లాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తితో పది నెలలుగా నిర్మానుష్యంగా మారిన పాఠశాలలు విద్యార్థుల రాకతో నేడు సందడిగా మారాయి.
ములుగు జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా రోజుల తర్వాత తమ స్నేహితులను, పాఠశాలను చూసిన విద్యార్థుల ఆనందంలో మునిగిపోయారు. సరికొత్త ఉత్సాహంతో తరగతులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కూడా అంతే ఉత్సాహంతో బోధన చేశారు. మొదటి రోజు కావడం వల్ల ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహించామని పాఠశాల యాజమాన్యాలు తెలిపారు.