ములుగు జిల్లాలో కరోనా బాధితుల కోసం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు 25 ఆక్సిజన్ కాన్సులేటర్లను అందజేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఆ పరికరాలను ములుగు, ఏటూరు నాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో 25 ఆక్సిజన్ కాన్సులేటర్లు అందజేత - ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఆక్సిజన్ కాన్సులేటర్ల పంపిణీ
ములుగు జిల్లాలో కరోనా బాధితులను ఆదుకునేందుకు సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకొచ్చారు. తమ సంస్థ తరఫున 25 ఆక్సిజన్ కాన్సులేటర్లను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అందజేశారు.
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఆక్సిజన్ కాన్సులేటర్ల పంపిణీ
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కలిసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సులేటర్లను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, డీపీఆర్వో రవికుమార్, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద రాష్ట్ర సీనియర్ మేనేజర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు