తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం - suicide

గ్రామస్థుడు చెప్పుతో కొట్టాడని మనస్తాపం చెంది ఓ సర్పంచ్​ పోలీస్​ స్టేషన్​ ముందే పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపూర్​ మండల కేంద్రంలో జరిగిన కలకలం రేపుతోంది.

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 22, 2019, 7:20 PM IST

పోలీస్​ స్టేషన్​ ముందు ఓ సర్పంచ్​ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లి కాంగ్రెస్ సర్పంచ్ నాగవత్ సుమన్​ను నీళ్లు రావడం లేదని గ్రామస్థుడు పోరిక రవి తమకు గొడవ నిలదీశాడు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపంతో స్టేషన్​ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details