గద్దెలపై ప్రతిష్ఠించేపుడు... ప్రధాన ద్వారాలు మూసి భక్తులను నిలిపివేశారు. గద్దెలపైకి చేరుకున్నట్లు సూచనగా విద్యుత్ దీపాలు ఆర్పివేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతీ రాఠోడ్, సీతక్క గద్దెల వద్దకు చేరుకున్నారు. ఉత్సవాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ - ములుగు జిల్లా
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహాజాతర తొలి రోజు క్రతువు వైభవంగా ముగిసింది. గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకున్నారు.
డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఆసీనులయ్యారు. గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెల మీద ప్రతిష్ఠించారు. పూజల అనంతరం పూజారులు బయటకు వెళ్లారు. అమ్మవారి ఆగమనంతో భక్తులు పరవశించిపోయారు.