తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవాలయ పరిసరాల్లో మాత్రమే పారిశుద్ధ్యం.. మిగిలిన చోట..? - ములుగు జిల్లా

మేడారం మహాజాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రన సాగుతోంది. దేవాలయం నుంచి జంపన్నవాగు వరకు భక్తులు వేసుకున్న గుడారాల వద్ద చెత్తను తీసివేయడంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారు.

దేవాలయ పరిసరాల్లో మాత్రమే పారిశుద్ధ్యం.. మిగిలిన చోట..?
దేవాలయ పరిసరాల్లో మాత్రమే పారిశుద్ధ్యం.. మిగిలిన చోట..?

By

Published : Feb 5, 2020, 11:20 PM IST

మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ నత్తనడకన సాగుతోంది. అమ్మవార్ల గద్దెలు, దేవాలయం పరిసరాలలో మాత్రమే పారిశుద్ధ్యం,శుభ్రతపై శ్రద్ద చూపుతున్న అధికారులు.. దేవాలయం నుంచి జంపన్నవాగు వరకు భక్తులు వేసుకున్న గుడారాల వద్ద మాత్రం చెత్తను తీసివేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

జాతరలో తిని పడవేసిన పేపర్ ప్లేట్లు, ఇతరాత్ర వ్యర్థాలను ఒక చోట వేయడానికి చెత్త కుండీల వంటి సదుపాయాలను కల్పించలేదు. మైదాన ప్రాంతాలలో వేసిన వ్యర్థాలు గాలికి చెల్లాచెదురుగా పడ్డాయి. అవి గాలికి ఎగిసిపడి గుడారాల్లోకి వచ్చి పడుతున్నాయి. అలాగే ఆ పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయని భక్తులు వాపోతున్నారు.

దేవాలయ పరిసరాల్లో మాత్రమే పారిశుద్ధ్యం.. మిగిలిన చోట..?

ఇవీ చూడండి:మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్​

ABOUT THE AUTHOR

...view details