Rush At Medaram Jatara: సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో మేడారంలోని సమ్మక్క, సారలమ్మ (Telangana Tribal Festival) వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతరకు నెలరోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జరిగే మేడారం జాతర జరుగుతుంది. దీంతో భక్తులు ముందుగానే సెలవు దినాలు చూసుకొని అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Huge Public At Medaram Temple: మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యాభై వేలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో దర్శనం కాస్త ఆలస్యమైంది. మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద భక్తుల స్నానాలకోసం ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క
'' సంక్రాంతి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చాం. సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి దర్శించుకున్నాం. గద్దెల వద్ద చాలా రద్దీ ఉండటంతో దర్శనానికి చాలా సమయం పడుతోంది. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత జాతరకు రావడం చాలా సంతోషంగా ఉంది." - భక్తులు