ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆటో డ్రైవర్లు, లారీ కూలీలు, హోటల్ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేసి మహబూబాబాద్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తారని పేర్కొన్నారు.చేతి గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోరిక బలరాం నాయక్ గెలిస్తే ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సీతక్క పేర్కొన్నారు.
రాహుల్ వస్తే ప్రతి పేద కుటుంబానికి రూ.6 వేలు - MAHABUBABAD MP CONTESTANT
ములుగులో చివరిరోజు కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. మహబూబాబాద్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తరపున ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
హోటల్ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న సీతక్క