తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగు దాటలేక బాలింత అవస్థలు - Road collapse Due to rain In Mulugu

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా మల్లూరు గ్రామంలో వాగు పొంగి ప్రవహిస్తోంది. దీనివల్ల కొత్తగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోయింది. నిండుగా ప్రవహిస్తున్న వాగు దాటలేక యశోద అనే గర్భిణి నానా అవస్థలు పడింది.

వాగు దాటలేక బాలింత అవస్థలు

By

Published : Jul 30, 2019, 12:05 AM IST

ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరు వాగు పొంగి ప్రవహిస్తోంది. మొట్లగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోవడం వల్ల బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురుడు పోసుకున్న పూరేడపల్లికి చెందిన బాలింత కుర్సుం యశోదను వైద్యులు ఇవాళ ఇంటికి పంపించారు. 102 వాహనంలో సిబ్బంది ఆమెను వాగు ఒడ్డుకు చేర్చారు. వాగు దాటి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు బాలింత యశోద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామస్థుల సాయంతో ఆమె వాగును క్షేమంగా దాటడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాగు దాటలేక బాలింత అవస్థలు

ABOUT THE AUTHOR

...view details