తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు ఆటోలు, ట్రాలీని ఢీకొట్టిన కారు... నలుగురికి గాయాలు - latest news of mulugu

ఆగి ఉన్న రెండు ఆటోలు, ట్రాలీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చల్వాయిలో చోటుచేసుకుంది.

road accident in mulugu four persons were injured
కారు సృష్టించిన బీభత్సం.. నలుగురు వ్యక్తులకు గాయాలు

By

Published : Jul 9, 2020, 7:57 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న రెండు ఆటోలు, టాటా ట్రాలీని కోరుట్ల నుంచి వాజేడు వెంకటాపురం వైపు వెళ్తున్న ఓ కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆటోలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులకి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు!

ABOUT THE AUTHOR

...view details