ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఆసియా ఖండంలోని అత్యధిక మంది హాజరయ్యే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
'మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష' - మేడారం జాతర పనులను సమీక్షించిన ములుగు కలెక్టర్
ఆసియా ఖండంలోని అత్యధిక మంది హాజరయ్యే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.
జంపన్నవాగు నుంచి చిలకలగుట్ట వరకు జరుగుతున్న స్నానాల ఘట్టాల వద్ద వాటర్ ట్యాప్ పనులను పరిశీలించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జంపన్న వాగు నీటి ప్రవాహంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులు వివరాలను సంబంధిత ముఖ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరలో ప్లాస్టిక్ సేకరణ కోసం ఎక్కువ సంఖ్యలో ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేయనున్న 7 షెడ్ల నిర్మాణం జనవరి 20 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'