తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువ వసూలు చేయొద్దు'

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేశారు. ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. దరఖాస్తులకు నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేయకూడదని తెలిపారు.

rdo inspection in mee seva centres in mulugu district
ఏటూరునాగారం మీ సేవా కేంద్రాల్లో ఆర్డీఓ తనిఖీలు

By

Published : Nov 5, 2020, 7:44 AM IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా సాగుతున్నాయని ఆరాతీశారు.

సాదాబైనామా దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాల వివరాలను మీసేవా కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాదాబైనామాకు, ఏ ఇతర సర్వీసులకైనా నిర్దేశించిన రుసుం కన్నా అధికంగా వసూలు చేయకూడదని ఆదేశించారు. అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:ఆసియాలోనే ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details