ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయ పరిసర ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కొరకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు దాని పరిసరాలలో ఉన్న మిగతా ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తమకు కేటాయించాలని కోరారని కలెక్టర్ తెలిపారు.
రామప్ప ఉప ఆలయాల సందర్శనలో కేంద్ర పురావస్తు శాఖ - ramappa temple
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కేంద్ర పురావస్తు శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి రామప్ప పరిసర ఉపఆలయాలను సందర్శించారు.
ఇందులో భాగంగానే.. కేంద్ర పురావస్తు శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిసర ప్రాంతంలో ఉన్న ఉప ఆలయాలను పరిశీలించారని చెప్పారు. ప్రతి ఆలయం చుట్టూ ప్రహరి ఏర్పాటు చేసి 40 అడుగుల రహదారి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని రెవెన్యూ అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత కుమారి, ఉమ్మడి జిల్లా అధికారి మల్లేశం, తహశీల్దార్ మంజుల, ఆర్ఐ రాజకుమారి, ఎస్సై రమేశ్, పాలంపేట సర్పంచ్ డోలే రజిత శ్రీనివాస్, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.