తెలంగాణ

telangana

ETV Bharat / state

నెల రోజులుగా మత్తడి దూకుతోన్న రామప్ప చెరువు - ramappa lake

రామప్ప చెరువు గత నెల రోజులుగా మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అడుగున్నర ఎత్తులో మత్తడి దూకుతోంది. మత్తడి ప్రవాహానికి రైతులు వేసిన పంటలు నీటమునిగాయి.

Ramappa pond has been flooded from one month in mulugu district
నెల రోజులుగా మత్తడి దూకుతోన్న రామప్ప చెరువు

By

Published : Sep 18, 2020, 5:27 PM IST

ఆగస్టు 15న సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన రామప్ప మత్తడి నెల రోజులుగా పరవళ్లు తొక్కుతోంది. గురువారం అడుగున్నర ఎత్తులో ప్రవాహం ఉరకలేసింది. ఈ నెల 14 వరకు అర అడుగు స్థాయికి చేరిన మత్తడి ప్రవాహం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ సరస్సులోకి అడుగు మేర నీరు చేరింది. 35 అడుగుల 4ఇంచుల నీటి సామర్థ్యం ఉన్న సరస్సులో ప్రస్తుతం 36 అడుగులకు మించి నీరుంది. మత్తడి ప్రవాహం తగ్గుతుందని కొట్టుకుపోయిన పొలాల్లో నాట్లు వేసుకున్న పొలాలు మళ్లీ నీట మునిగాయి. దాంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అడుగున్నర ఎత్తులో మత్తడి పోస్తుందంటే, కనీసం 15 రోజుల పాటు కొనసాగే ఆస్కారం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈ లోపు మళ్లీ వర్షం పడితే మరో నెల రోజుల పాటు మత్తడి పోసినా ఆశ్చర్యం లేదని రైతులు అంచనాలు వేసుకుని సాగుపై ఆశలు వదిలేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details