ములుగు జిల్లాలోని కురిసిన భారీ వర్షాలకు వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సు నిండిపోతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోగా.. చెరువు మూడు అడుగుల ఎత్తుతో మత్తడిపోస్తూనే ఉంది. శుక్రవారం జంగంపల్లి గ్రామంలోని మేడివాగు వద్ద వరద ఉద్ధృతి పెరిగి.. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు నడవలేని పరిస్థితి ఉండగా పోలీసులు పడవ సహాయంతో గర్భిణీ స్త్రీని మేడివాగు సమీపానికి చేర్చారు.
డ్రోన్ కెమెరాతో నీట మునిగిన పొలాలను పరిశీలించిన అధికారులు - ramappa lake water flow drone visuals
గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ములుగు జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం బండారుపల్లిలో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి ఆచూకీతో పాట పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను అధికారులు డ్రోన్ కెమెరాతో పరిశీలించారు.
డ్రోన్ కెమెరాతో నీట మునిగిన పొలాలను పరిశీలించిన అధికారులు
శుక్రవారం ఉదయం బండారుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఐ బృందం, పోలీసుల సహాయంతో జలాశయంలో వెతికిన వారి ఆచూకీ దొరకలేదు. ములుగు, జంగాలపల్లి, ఇంచెర్ల, పాలసబ్పల్లి, రామయ్య తండా ప్రాంతాల్లో అధికారులు డ్రోన్ కెమెరాతో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు.