ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇంకా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురసిన భారీ వర్షాలకు... ఇవాళ కాస్తంత విరామం ఇచ్చింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
లోతట్టు ప్రాంతాలకు కొనసాగుతున్న వరద నీరు - పొంగుతున్న జంగాలపల్లి వేడు వాగు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు... ఇవాళ కాస్త విరామం ఇచ్చినందున ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

లోతట్టు ప్రాంతాలకు కొనసాగుతున్న వరద నీరు
ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో వేడి వాగు వద్ద జాతీయ రహదారిపై ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. ఒక్క లారీలకు మాత్రమే అనుమతించారు. ఇతర వాహనాలు ప్రయాణించకుండా... పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.