33 నెలలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని పీఆర్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులతో కలిసి నిరసన చేపట్టింది. 45శాతం ఫిట్మెంట్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి' - ఫిట్మెంట్
ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తక్షణమే బదిలీలతో కూడిన ప్రమోషన్లు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'
ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల విద్యావ్యవస్థ 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా' తయారైందని నాయకులు విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొత్త పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్: షబ్బీర్ అలీ