తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబులెన్స్​లోనే గర్భిణీకి పురుడుపోసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం - telangana latest news

పురిటి నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణీకి అంబులెన్స్​ సిబ్బంది ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

గర్భిణీకి పురుడుపోసిన అంబులెన్స్​ సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం
గర్భిణీకి పురుడుపోసిన అంబులెన్స్​ సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం

By

Published : Sep 25, 2021, 10:29 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్​కు సమాచారం అందించారు. 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గర్భిణీకి ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం వెంకటాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి.

పరిస్థితిని గమనించిన అంబులెన్స్​ సిబ్బంది.. చాకచక్యంగా వ్యవహరించి గర్భిణీకి సుఖ ప్రవసం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండగా.. మెరుగైన వైద్యం కోసం వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. సమయానికి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన అంబులెన్స్​ సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: HYDERABAD RAINS: హైదరాబాద్​లో భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details