ములుగు కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా పీపీఈ కిట్లు పంచారు. కరోనా వల్ల ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నా.. ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి తమవంతు సాయంగా పీపీఈ కిట్లు, శానిటైజర్, మాస్కులు అందించామని లయన్స్ క్లబ్ బాధ్యుడు పొన్నగంటి శ్రీనివాస్ అన్నారు.
వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేత - వరంగల్ జిల్లా వార్తలు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా నివారణకు పాటు పడుతున్న వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. ములుగు కలెక్టర్ కార్యాలయంలో వీటిని అందించారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్ల పంపిణీ