తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతగా పడిన వర్షాలతో జిల్లాలో జలకళ సంతరించుకుంది.

ponds and lakes filled with flood water and heavy rain in mulugu district
జిల్లాలో భారీ వర్షాలు... పొంగిపోర్లుతున్న వాగులు, సరస్సులు

By

Published : Aug 14, 2020, 2:41 PM IST

ములుగు జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. కొత్తగూడ అడవి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు బొగ్గుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. 34 అడుగులు నీటిమట్టం చేరుకొని మత్తడి పోస్తుంది. వెంకటాపూర్ మండలం రామప్ప సరస్సులోకి 29.5 అడుగులకు నీటిమట్టం చేరింది.

చత్తీస్​ఘడ్, మహారాష్ట్ర రాష్ట్రల్లో కురుస్తోన్న వర్షాలకు వాజేడు మండలంలోని పేరూరు వద్ద మళ్లీ గోదావరిలో ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం 9.62 మీటర్ల నుంచి 10.64 మీటర్లుకు నీటిమట్టం చేరింది. సుమారు 34 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?

ABOUT THE AUTHOR

...view details