తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగులో పటిష్ఠ నిఘా - పటిష్ఠ డ్రోన్​ కెమెరా నిఘాల నడుమ ములుగు

కరోనా విజృంభిస్తోన్న వేళ.. గ్రీన్​జోన్​గా ఉన్న ములుగు జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రాతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిలువరించేందుకు పకడ్బందీ నిఘా కెమెరాల సాయంతో నిరంత పర్యవేక్షణ చేస్తున్నారు.

Police have drone camera surveillance over Mulluga district
నిఘా కెమెరాల నడుమ.. నిత్యం పర్యవేక్షణలో ములుగు

By

Published : Apr 25, 2020, 5:23 PM IST

కరోనా వైరస్ నివారణ కోసం ములుగు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ములుగు పురవీధులు, దారులు, కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ప్రజలు గుంపులుగా ఉండే ప్రదేశాలను పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఆరుబయట క్రికెట్ ఆడుతున్న పిల్లలు డ్రోన్ కెమెరాలను చూసి పరుగులు పెడుతున్నారు. ములుగు జిల్లా గ్రీన్​జోన్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చూడండి:శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి

ABOUT THE AUTHOR

...view details