Police defused landmines: ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో.. ఓ ప్రెజర్ కుక్కర్, 20 మీటర్ల కార్డెక్స్ వైర్, రెండు డిటోనేటర్లు, 33 బ్యాటరీలు, మదర్ బోర్డులు, కండెన్సర్లు, కెమెరా ప్లాష్, వైర్ బెండిల్స్ లాంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులు అమర్ఛిన మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు - Maoists activities
Police defused landmines: ములుగు జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్ఛిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చంపటమే ప్రధాన ఉద్దేశంగా ఈ మందుపాతరలను పెట్టినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
Police defused landmines planted by Maoists at Penugolu Forest
కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చంపాలనే ఉద్దేశంతో కంకేర్ ఆర్పీసీ సభ్యులతో పాటు కొంత మంది మిలీషియా సభ్యులు కలిసి.. ఈ పేలుడు పదార్ధాలను అమర్చినట్లు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. గతంలో కూడా మావోయిస్టులు అమర్చిన మందుపాతరల వల్ల అమాయక గిరిజనులు, పశువులు మరణించాయని తెలిపారు. ఈసారి మాత్రం ఎలాంటి నష్టం జరగకముందే.. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామన్నారు.
ఇదీ చూడండి: