తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల విస్తృత తనిఖీలు.. వారికి సహకరించకూడదని విజ్ఞప్తి - Police inspections in Mulugu district latest news

డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులకు సహకరించకూడదంటూ స్థానికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

Police checks in the wake of PLGA week
Police checks in the wake of PLGA week

By

Published : Dec 2, 2022, 3:51 PM IST

తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీగఢ్ సరిహద్దు ప్రాంతమైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారత్సోవాల నేపథ్యంలో గోదావరి తీరం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, మహముత్తారం, పలిమెల, కాటరం, మల్హర్ మండలాలు.. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నిరంతరం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహకరించకూడదంటూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు మావోయిస్టుల వారోత్సవాలు, మరోవైపు పోలీసుల తనిఖీలతో గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details