తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత జాతరగా తెలంగాణ కుంభమేళా' - PLASTIC KALAKEYA in Medaram jathara

మేడారం జాతరను పాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జాతరను పాస్టిక్ రహితంగా జరుపుకోవాలని సూచిస్తూ... గట్టమ్మ ఆలయం వద్ద పాస్టిక్ వస్తువులతో రుపొందించిన 20 అడుగుల కాలకేయ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

PLASTIC KALAKEYA in Medaram jathara
'ప్లాస్టిక్ రహిత జాతరగా తెలంగాణ కుంభమేళా'

By

Published : Dec 18, 2019, 6:38 PM IST

ప్లాస్టిక్ రహిత మేడారం జాతరలో భాగంగా ములుగు జిల్లా గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 20 అడుగుల ప్లాస్టిక్ కాలకేయ బొమ్మను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులతో రూపొందించిన కాలకేయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించే ప్లాస్టిక్​ను జిల్లా నుంచి పారద్రోలేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావటం వల్ల... పర్యావరణానికి హాని కలుగుతుందని... దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుంకే కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. జాతర ప్లాస్టిక్ రహితంగా జరిగేలా అందరూ సహకరించాలంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి...

'ప్లాస్టిక్ రహిత జాతరగా తెలంగాణ కుంభమేళా'

ఇవీచూడండి: బయో డైవర్సిటీ పైవంతెనలో లోపాలు లేవు: లోకేష్​ కుమార్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details