దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి, రెండో దశ నిర్వహణ కోసం.. ప్రభుత్వం అనుమతిచ్చింది. 2020 జూన్ నుంచి 2022 మే నెలాఖరు వరకు నిర్వహణ కోసం..34 కోట్ల రూపాయల వ్యయంతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
దేవాదుల ఎత్తిపోతల మొదటి, రెండో దశల నిర్వహణకు అనుమతి
దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి, రెండో దశ నిర్వహణ కోసం ప్రభుత్వం అనుమతిచ్చింది. ఖరీఫ్ సీజన్‌లో ఈ పనుల నిర్వహణ కోసం టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు వరంగల్ చీఫ్ ఇంజినీర్‌కు అనుమతిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాదుల ప్రాజెక్టు, ములుగు జిల్లా
ఆర్నెళ్లకు బదులుగా పది నెలల పాటు నీటిని ఎత్తిపోయాలన్న ప్రభుత్వం..ఏడాది మొత్తం ఆన్ స్కిల్డ్ లేబర్ ఉండేలా చూడాలని తెలిపింది. ఖరీఫ్ సీజన్‌లో నిర్వహణ కోసం టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు వరంగల్ చీఫ్ ఇంజినీర్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
- ఇదీ చదవండి :టీకా పంపిణీలో 7 కోట్ల మైలురాయిని దాటిన భారత్