తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో పీసీసీఎఫ్ రొయ్యూరు శోభ విస్తృత పర్యటన - pccf royyur shobha visited bogatha water fall

ములుగు జిల్లాలో రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి రొయ్యూరు శోభ విస్తృతంగా పర్యటించారు. రామప్ప ఆలయం రామలింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొగత జలపాతాన్ని సందర్శించారు.

జిల్లాలో పీసీసీఎఫ్ రొయ్యూరు శోభ విస్తృత పర్యటన
జిల్లాలో పీసీసీఎఫ్ రొయ్యూరు శోభ విస్తృత పర్యటన

By

Published : Oct 30, 2020, 7:29 PM IST


ములుగు జిల్లాలో రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి రొయ్యూరు శోభ విస్తృతంగా పర్యటించారు. రామప్ప ఆలయం రామలింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప చరిత్ర గురించి గైడ్ విజయ్​ని అడిగి తెలుసుకున్నారు. పాలంపేట గ్రామ సమీపంలో ఉన్న కేన్ అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని సంరక్షించుకోవటం అందరి బాధ్యత అని తెలిపారు.

ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్​ఓ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మరమ్మతులు చేసిన ఎఫ్​డీఓ ఛాంబర్​ను రొయ్యూరు శోభ ప్రారంభించారు. వాజేడు మండలం చీపురుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని సందర్శించారు. వాచ్ టవర్, పిల్లలు ఆడుకునే పార్క్ పరిశీలించారు. వచ్చే పర్యటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ఎఫ్డీఓ నిఖిత, ట్రైనీ ఐఎఫ్​ఎస్ రాహుల్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివానితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details