ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తజనం పోటెత్తారు. బుధవారం అమ్మవార్ల దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు. జంపన్న వాగు, బస్టాండ్ ప్రాంతాల నుంచి కాలినడకన అమ్మవార్ల గద్దెల వరకు చేరుకున్నారు.
మేడారానికి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తజనం - మేడారం వార్తలు
మేడారానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం భారీగా పొటెత్తారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారానికి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తజనం
మొక్కిన మొక్కులు తీర్చేందుకు వనదేవతలైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజులకు పసుపు, కుంకుమ, వడిబియ్యం, నూతన వస్త్రాలు, నిలువెత్తు బంగారం సమర్పించారు.