రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇంటివద్దనే టీవీల్లో, చరవాణిలో పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు పాఠాలు చూస్తున్నారా లేదా అని ములుగు జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం - online clasess latest news
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను మంగళవారం నుంచి ప్రారంభించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం