ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన జల్లిగంపల లక్ష్మీపతి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ పంచాయితీ కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లారు. రెవెన్యూ అధికారులు అన్నవైపు మొగ్గు చూపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక లక్ష్మీపతి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందే పురుగుల మందు తాగాడు. పక్కవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం - mulugu district news
ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములకు మధ్య గొడవ జరిగింది. పంచాయితీ తహసీల్దార్ వద్దకు చేరింది. రెవెన్యూ అధికారులు ఓ వైపే మొగ్గుచూపుతున్నారని విసుగుచెందిన తమ్ముడు ఆత్యాహత్యాయత్నం చేశాడు. వెంకటాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
తహసీల్దార్ కార్యాలయం ముందే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం