తెలంగాణ

telangana

ETV Bharat / state

జంపన్నవాగులో నీరు తక్కువ.. ఇసుక దిబ్బలు ఎక్కువ.. - more sand dunes in jampannavagu in medaram

ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో స్నానాలకు వచ్చే భక్తులకు ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. లక్నవరం నుంచి నీటిని పూర్తిస్థాయిలో అధికారులు వదలకపోవడం వల్ల ఇలా జరిగిందని భక్తులు చెబుతున్నారు.

no water in jampannavagu medaram
జంపన్నవాగులో నీరు తక్కువ.. ఇసుక దిబ్బలు ఎక్కువ..

By

Published : Feb 6, 2020, 5:19 PM IST

Updated : Feb 6, 2020, 6:07 PM IST

ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానమాచరించి.. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయతీగా భావిస్తారు. దూరప్రాంతాల నుంచి ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చిన భక్తులు ఈ వాగులో ఈత కొడుతూ సేదతీరుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమీపంలోని లక్నవరం చెరువు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తారు.

అయితే ఈసారి కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేశారు. వాటిని కూడా జంపన్నవాగు ప్రారంభంలో వచ్చే బ్రిడ్జి వద్ద కట్టలు వేసి ఆపేశారు. అందువల్ల జంపన్నవాగులో నీరు తక్కువ.. ఇసుక దిబ్బలు ఎక్కువ దర్శనమిస్తున్నాయి. వాగులో స్నానాలు చేద్దామని వచ్చిన భక్తులకు నిరాశే మిగులుతోంది. వేరే ప్రత్యామ్నాయం లేక.. వాగు పక్కనే అమర్చిన నల్లాల వద్దకు వెళ్తున్నారు.

జంపన్నవాగులో నీరు తక్కువ.. ఇసుక దిబ్బలు ఎక్కువ..

ఇదీ చూడండి :విద్యుద్దీప కాంతుల్లో.. మేడారం జాతర.!

Last Updated : Feb 6, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details