తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరను ప్లాస్టిక్​ రహితం చేసేందుకు ప్రణాళిక - మేడారం జాతరలో ప్లాస్టిక్ నిషేధం

ములుగును ప్లాస్టిక్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారం జిల్లాలో జరగనున్న మేడారం జాతరను.. ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

No plastic usage
ప్లాస్టిక్​ రహిత జాతరగా మేడారం

By

Published : Dec 5, 2019, 5:53 PM IST

ప్లాస్టిక్​ రహిత జాతరగా మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధించాలంటూ.. అధికారికంగా చేపట్టిన చైతన్యానికి ములుగు జిల్లా అధికార యంత్రాంగం ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్లాస్టిక్ నిషేధంలో ములుగు జిల్లా ముందుండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు.

వంద శాతం ప్లాస్టిక్ రహితం

జిల్లాలోని ఉన్నత అధికారులతో ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ములుగు జిల్లాలో వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా పేపర్ సంచులను వాడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈసారి ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న మేడారం జాతరలో 100% ప్లాస్టిక్ రహితంగా జరుపుకొని పర్యావరణాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు.

భక్తులు సహకరించండి

ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, శిక్షణ సంస్థలు, ఇలా అన్ని వర్గాలను ఏకం చేసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరగబోయే మేడారం జాతరలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధించాలంటూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడారం జాతరలో భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. భక్తులంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు

ABOUT THE AUTHOR

...view details