తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంపులుగా జనం.. ఎవరికి లేదు భయం! - mulugu district news

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జనాలు గుమిగూడవద్దని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా ప్రజలకు చెవికెక్కటం లేదు. బ్యాంకుల వద్ద నగదు కోసం జనం భౌతిక దూరానికి మంగళం పాడుతున్నారు.

no physical distance in mulugu district
గుంపులుగా జనం.. లేదా భయం!

By

Published : Jun 9, 2020, 7:03 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు ముందు జనాలు మాస్కులు లేకుండా గుమిగూడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా జనం బ్యాంకు గేటు ముందు నిలబడ్డారు. ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించకుండా, ఒకరిపై ఒకరు తోసుకున్నారు. కొంత మంది మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు. వారికి సూచనలు చేసేందుకు అధికారులు కూడా అందుబాటులో లేకుండా పోయారు.

ఎస్​బీఐ బ్యాంకు వద్దకు పింఛను కోసం వచ్చిన ఓ వృద్ధురాలు బ్యాంకులోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి తప్పదు అని అంటున్నారు స్థానికులు.


ఇవీ చూడండి:'ఆసుపత్రులు సందర్శించని ఏకైక సీఎం కేసీఆర్'

ABOUT THE AUTHOR

...view details