ములుగు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడడం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వల్ల రోడ్లన్ని జలమయం అయ్యాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణం చల్లబడటం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు.
ములుగు జిల్లాలో తొలకరి చినుకులు - తొలకరి
గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు చిరుజల్లులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ములుగు జిల్లాలో భారీ గాలులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటం వల్ల ప్రజలు ఉపశమనం పొందారు.

ములుగు జిల్లాలో తొలకరి చినుకులు