ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట, రామంజపూర్, కేశాపూర్, పాపయ్యపల్లెలో ముంపునకు గురైన పంటపొలాలను జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీశ్వర్ పరిశీలించారు. మునిగిన పంట పొలాలు వద్దకు వ్యవసాయ అధికారులను పిలిపించారు.
రైతులను ఆదుకుంటాం: జడ్పీ ఛైర్పర్సన్ - mulugug district latest news
ముంపునకు గురైన పంటపొలాల రైతులను ఆదుకుంటామని ములుగు జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీశ్వర్ తెలిపారు. వెంకటాపురం మండలం పాలంపేట, రామంజపూర్, కేశ పూర్, పాపయ్యపల్లెలో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు.
![రైతులను ఆదుకుంటాం: జడ్పీ ఛైర్పర్సన్ mulugu zp chairperson kusuma jagadeeshwar The flooded crop fields were examined](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8565516-5-8565516-1598440854561.jpg)
రైతులను ఆదుకుంటాం: జడ్పీ ఛైర్పర్సన్
పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్నదాతలు ఆవేదనకు గురికావొద్దని చెప్పారు. వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇప్పంచి... రైతులను ఆదుకుంటామని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.