తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద ప్రాంతాల్లో పర్యటించిన ములుగు ఎస్పీ! - Mulugu SP Visits Flood Areas

ములుగు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రాంతాల్లో జిల్లా పరిషత్​ ఛైర్​ పర్సన్​ కుసుమ జగదీశ్వర్​, ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ పర్యటించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద ప్రవాహం తగ్గి.. శాంతించాలంటూ మంగంపేట మండలానికి చెందిన మహిళలు గోదావరి నదికి హారతులిచ్చి పూజలు చేశారు.

Mulugu SP Visits Flood Areas
వరద ప్రాంతాల్లో పర్యటించిన ములుగు ఎస్పీ!

By

Published : Aug 17, 2020, 11:03 PM IST

గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో ఉన్న రాంనగర్, లంబాడి తండాతో సహా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవ సాయంతో జిల్లా పరిషత్​ ఛైర్ పర్సన్​ కుసుమ జగదీశ్వర్​, ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. లక్నవరం సరస్సు వరద ప్రవాహం కొంతమేరకు తగ్గింది. మేడారం జంపన్న వాగు కూడా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది.

వరద నీరు ప్రవహించిన ప్రాంతమంతా ఇసుక మేటలు వేసింది. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్​తో పాటు.. ఏఎస్పీ సాయి చైతన్య, ఎస్సై, సీఐ తదితరులు వరద ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలోని మంగంపేట మండలం కమలాపురం, గుడ్డెలుగుల పల్లికి గోదావరి వరద నీరు చేరగా.. ఆయా గ్రామాల మహిళలు గోదావరి నదికి హారతులిచ్చి వరద ప్రవాహం తగ్గాలని పూజలు చేశారు.

ఇదీ చూడండి :'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ABOUT THE AUTHOR

...view details