ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163పై స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మాస్కుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగు ఎస్సైలు హరికృష్ణ, ఫణీ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు, వాహనదారులకు, పాదచారులకు మాస్కులు పంపిణీ చేశారు.
'మాస్కు లేకుంటే కఠిన చర్యలు తప్పవు'
మాస్కుల వినియోగంపై ములుగు జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులకు, పాదచారులకు మాస్కులు పంపిణీ చేశారు.
ములుగులో మాస్కుల పంపిణీ
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎస్సై హరికృష్ణ తెలిపారు. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవని, చలానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సైలు, కానిస్టేబుల్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.