కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. మానవతావాదులంతా ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. తాడ్వాయి మండలంలోని జలగలంచ, గోతికోయగూడెంకు చెందిన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసి అండగా నిలిచిన హన్మకొండకు చెందిన ఈఫ్కొ టోకియో జనరల్ ఇన్సురెన్స్ సంస్థ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
MLA Seethakka: మానవతావాదులు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి - ములుగు ఎమ్మెల్యే సీతక్క
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హన్మకొండకు చెందిన ఈఫ్కొ టోకియో జనరల్ ఇన్సురెన్స్ సంస్థ ప్రతినిధులు.. ములుగు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే కోయలకు అండగా నిలిచారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి పేదలను ఆదుకున్న దాతలను.. ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేకంగా అభినందించారు.
Distribution of essentials
కరోనా మహమ్మారి పేదల జీవితాలను అతలాకుతలం చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలు.. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పసివాడి ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు!