మేడారం మహాజాతరలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి... భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. 5 న అమ్మవార్లు గద్దెకు చేరుకోవటం నుంచి 8న వనంలోకి చేరే వరకు సాగనున్న మహాఘట్టానికి పెద్దఎత్తున పాల్గొని అమ్మవార్ల దీవెనలు పొందాలని భక్తులను ఆహ్వానించారు.
'మహాఘట్టానికి వచ్చి అమ్మవార్ల ఆశీర్వాదం పొందండి' - మేడారం జాతర విశేషాలు
రేపటి నుంచి మొదలుకానున్న మహాజాతరలో కుటుంబసమేతంగా పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం పొందాలని ఎమ్మెల్యే సీతక్క భక్తులను ఆహ్వానించారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు విధుల్లో హాజరై... భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారని తెలిపారు.
MULUGU MLA SEETHAKKA INVITES DEVOTEES TO MEDARAM JATHARA 2020
అన్ని వేళలా అందుబాటులో ఉంటూ... ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని సీతక్క తెలిపారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..